![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -115 లో.. సీతాకాంత్, రామలక్ష్మిలని రెడీ అవ్వమని సిరి చెప్పి వెళ్ళిపోతుంది. ఇక రామలక్ష్మి టెన్షన్ పడుతుంటే.. ఈ పెళ్లి జరగదని సీతాకాంత్ చెప్తాడు. మరోవైపు శ్రీవల్లి ఒంటరిగా రకరకాల ప్రశ్నలు వేసుకుంటు తిరుగుతుంది. శ్రీలత, సందీప్ ల కోసం శ్రీవల్లి బయటే ఎదురుచూస్తుంది.
అప్పుడే శ్రీలత, సందీప్ లు రాగా వాళ్లని ప్రశ్నల మీద ప్రశ్నలతో విసిగిస్తుంది శ్రీవల్లి. పెళ్లి ఏర్పాట్లు మాత్రమే జరుగుతాయి కానీ పెళ్ళి జరగదని... పరాయి వాడిని పెళ్ళి చేసుకోడానికి ఏ అమ్మాయి ఒప్పుకోదని శ్రీవల్లికి అర్థమయ్యేలా సందీప్ చెప్తాడు. మరోవైపు గదిలో రామలక్ష్మి కూర్చొని పెళ్ళి గురించి టెన్షన్ పడుతుంది. ఇక అప్పుడే కారులో మాణిక్యం అతని భార్య , చిన్న కూతురు వస్తారు. ఆడశకుని శ్రీలత మనల్ని ప్రేమతో రమ్మని పిలవడం వెనుక ఏదో లెక్కుందని మాణిక్యం అనగానే.. మన కూతురి పెళ్ళి మనం కళ్ళారా చూడాలని ఆమె అలా చూపిస్తుంటే మీ లెక్కలేంటని అతని భార్య తిడుతుంది. ఇక గుమ్మడి దాకా వచ్చిన మాణిక్యం లోపలికి రాకుండా ఆగిపోతాడు. ఇక మాణిక్యం ఫ్యామిలీని చూసిన శ్రీలత, సందీప్ రిసీవ్ చేస్కోవడానికి వెళ్తారు. అక్కడే ఆగిపోయావేం మాణిక్యం లోనికి రా.. నేను అప్పుడన్నవి ఏం పట్టించుకోకని శ్రీలత చెప్తుంది. మాణిక్యం కుటుంబం ఇంట్లోకి వస్తారు. సిరి, ధన వచ్చి మాణిక్యాన్ని పలకరిస్తారు. సిరితో పాటు రామలక్ష్మి వాళ్ళ అమ్మ, చెల్లి కలిసి తన గదిలోకి వెళ్తారు. మరోవైపు సీతాకాంత్ తన గదిలో పెళ్ళి ఎలా ఆపాలా అని తీవ్రంగా ఆలోచిస్తాడు.
మేమ్ నిజంగా పెళ్లి చేసుకోలేదని నిజం చెప్పేస్తే బెటర్ అని దానికి మించి ప్లాన్ లేదని సీతాకాంత్ అనుకుంటాడు. కాసేపటికి రామలక్ష్మి, సీతాకాంత్ రెడీ అయ్యి కిందకి వస్తారు. మీ అందరికి నేనొక విషయం చెప్పాలని సీతాకాంత్ అంటాడు. అందరు ఏం చెప్తాడా అని ఆలోచిస్తుంటారు. మా పెళ్ళి అని సీతాకాంత్ అనగానే.. ఆగు సీతా అని స్వామి వస్తాడు. నువ్వేం చెప్పాలనుకున్నావో నాకు తెలుసు.. కానీ ఇప్పుడు వద్దు వెళ్ళి పీటలపై కూర్చోమని స్వామి చెప్పగానే.. అందరు ఆశ్చర్యపోతారు. ఏంటి స్వామి తనేదో చెప్పాలంటే వద్దంటున్నారని శ్రీలత అనగానే.. అంతా శివుడి ఆజ్ఞ.. తనేం చెప్తే అదే జరుగుతుంది. ముహుర్తం మించిపోతుందని రామలక్ష్మి, సీతాకాంత్ లని పీటలపై కూర్చొమని స్వామి చెప్తాడు. ఇక ఇద్దరు కలసి పీటలపై కూర్చోగానే హోమం మొదలవుతుంది. రామలక్ష్మికి సీతాకాంత్ బొట్టు పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |